వినయ విధేయుడి కోసం ఎన్టీఆర్, రాజమౌళి??

0
212

మెగా అభిమానులకు శుభవార్త. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వినయ విధేయ రామ’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా ఈ సినిమా గురించి ఓ తాజా వార్త సోషల్ మీడియాలో హల చల్ చేస్తోంది. త్వరలో వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ వేడుకకు రాజమౌళిని, ఎన్టీఆర్ లను చీఫ్ గెస్ట్ లుగా ఆహ్వానించబోతున్నారని టాక్. స్క్రీన్ మీదే కాక ఆఫ్ స్క్రీన్ కూడా హీరోల మధ్య రిలేషన్ స్ట్రాంగ్ అయ్యేందుకు ఒక హీరో సినిమా ఫంక్షన్ లకు మరో హీరో హాజరవుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘భారత్ అనే నేను’ సినిమా ఈవెంట్ లో కూడా తారక్ కనిపించి అభిమానులను అలరించారు.